ది కశ్మీర్ ఫైల్స్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించగా, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్‌కు కీలకపాత్రలు పోషించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఇక అసలు మ్యాటర్ ఏంంటే.. తెలుగు ఫ్యాన్స్‌కు నిర్మాత అభిషేక్ అగర్వాల్ గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే తెలుగులో డబ్ కానుందని ప్రకటించారు. త్వరలో దేశంలోని అన్ని భాషల్లో సినిమాను అనువదించే ఆలోచనలో ఉన్నామని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ క్రమంలో అతి త్వరలోనే తెలుగుతో పాటు పలు భాషల్లో ది కాశ్మీర్ ఫైల్స్ సందడి చేయనుంది. ఇకపోతే ఈ సినిమాకి అసోం, గుజరాజ్, మధ్యప్రదేశ్, హరియాణా, కర్ణాటక సహా 9 రాష్ట్రాల్లో వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు. ది కశ్మీర ఫైల్స్ సినిమాను వెబ్ సిరీస్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ఇటీవల ప్రకటించారు.