Telangana: కాంగ్రెస్ ఆరు హామీల బాధ్యత నాదే: ప్రియాంక గాంధీ

సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల కష్టాలను భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ సంపదను పంచుకునే పనిలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమై ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

Telangana: సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల కష్టాలను భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ సంపదను పంచుకునే పనిలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమై ఉన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలను అమలు చేసే బాధ్యత నాదేనని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తానన్న హామీని నెరవేర్చలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలే దేశానికి నాయకులని, మోడీ, కేసీఆర్ లు ప్రజల కంటే తామే పైకమని భావిస్తున్నారన్నారు. భారత ప్రభుత్వం ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? మీరంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులంతా మంత్రులు అయ్యారు. బీఆర్ఎస్ నాయకులందరికీ వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారని ప్రియాంక గాంధీ వివరించారు.

Also Read: PM Modi AP Tour: నేడు తిరుమలకు ప్రధాని, సీఎం జగన్ తిరుపతి టూర్

  Last Updated: 26 Nov 2023, 10:19 AM IST