Site icon HashtagU Telugu

UP: దళిత బాలిక వీడియోను షేర్ చేస్తూ ప్రియాంకా గాంధీ హెచ్చరిక

Template (91) Copy

Template (91) Copy

దొంగతనానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఓ దళిత మైనర్ బాలికను కర్రలతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో చోటు చేసుకుంది. ఆ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి చర్యల పై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 24 గంటల్లో నిందితులని అదుపులోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ప్రియాంకా గాంధీ ట్వీట్ చేసిన 20 నిమిషాల్లోనే అప్రమత్తం అయిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మిగతావారి కోసం గాలిస్తున్నట్టు ట్వీటర్ వేదికగా ప్రకటించారు.

https://twitter.com/priyankagandhi/status/1476073591812722688?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1476073591812722688%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fvideo-dalit-girl-tortured-by-a-family-accused-of-theft-in-amethi-shocker-2677490