Site icon HashtagU Telugu

Priyanka Gandhi: నిన్న సోనియా…ఇవాళ ప్రియాంకకు కోవిడ్ పాజిటివ్..!!

Priyanka

Priyanka

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ నిర్థారైన సంగతి తెలిసిందే .ఒక్క రోజు వ్యవధిలోనే ఆమె కూతురు ప్రియాంకా గాంధీకి కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో తనకు పాజిటివ్ అని నిర్దారణ అయ్యిందని ప్రియాంక తెలిపారు. ప్రస్తుతం తాను కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తున్నట్లు…హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

కాగా తన తల్లికి కోవిడ్ సోకిందన్న విషయం తెలియగానే లక్నోలో ఉన్న ప్రియాంక తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అయితే తన షెడ్యూల్ ను ఎందుకు అర్థాంతరంగా రద్దు చేసుకున్నారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమలో లక్నోలో రెండు రోజులపాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల నుంచి ప్రియాంక వెనక్కి వచ్చారు. ఇంతలోనే ఆమెకు కూడా కోవిడ్ నిర్దారణ అయ్యింది.

Exit mobile version