Site icon HashtagU Telugu

Priyanka Chopra: అందాల సుందరి ‘బికినీ షో’.. ప్రియాంక ఫొటో వైరల్!

Priyanka

Priyanka

ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన ప్రియాంక కెరీర్ జట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ పై తనముద్ర వేస్తోంది. ఇప్పటికీ ప్రియాంక కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రియాంకకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ అయిన సమయంలో బికినీతో ఫొటో షూట్ చేసింది. స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ అయ్యిన ప్రియాంక ఫొటో  ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంది. శ్రీమతి జోనాస్ పాంథర్ ప్రింట్ స్విమ్‌సూట్‌తో బ్యాంగిల్స్ ధరించి, కాంస్య మేకప్‌తో అందాలను ఒలకబోసింది.

ఈ ఫోటోషూట్‌లో ప్రియాంక గ్లామరస్ ఫొజులతో ఆకట్టుకుంది. సముద్రం ఒడ్డున బ్రౌన్ కలర్ స్విమ్‌సూట్‌లో చెట్టు పక్కన ఉన్న ప్రియాంక చూడముచ్చటగా ఉంది. 2000లో ప్రియాంక ప్రపంచ సుందరి అయినప్పుడు, ఆమె వయస్సు 21 సంవత్సరాలు. ప్రస్తుతం ప్రియాంక గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. ప్రియాంక పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. ‘సిటాడెల్’, ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ’ ‘ఎండింగ్ థింగ్స్’ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించనుంది ప్రియాంక. కత్రినా కైఫ్, అలియా భట్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘జీ లే జరా’లో కూడా ప్రియాంక నటించింది.

Exit mobile version