Private Schools: వ్యాక్సినేషన్ కు ‘ప్రైవేట్ పాఠశాలలు’ దూరం

అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు వ్యాక్సిన్‌లను వ్యతిరేకిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - March 29, 2022 / 05:53 PM IST

అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు వ్యాక్సిన్‌లను వ్యతిరేకిస్తున్నాయి. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావించి, 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను నిర్వహించడానికి ఆరోగ్య అధికారులను అనుమతించడం లేదు. ఫలితంగా  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO), హైదరాబాద్, క్యాంపస్‌లో టీకా డ్రైవ్‌లను అనుమతించేలా పాఠశాలలను ఒప్పించాలని విద్యా శాఖ అధికారులను కోరారు. ప్రైవేట్ పాఠశాలలు వ్యాక్సిన్ కు దూరంగా ఉండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ విషయమై వైద్యాశాఖ ప్రత్యేక చర్యలకు దిగే అవకాశం ఉంది.