Site icon HashtagU Telugu

End To Homelessness : ఐదేళ్ళలో దేశంలో అందరికీ సొంతిల్లు

End To Homelessness

End To Homelessness

End To Homelessness : బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది.. 

వచ్చే ఐదేళ్ళలో బ్రిటన్ లో ఇళ్ళు లేని వారందరికీ ఇళ్ళను నిర్మించి ఇచ్చే ప్రాజెక్టును మొదలుపెట్టింది. 

హోమ్‌వార్డ్స్ పేరుతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 

బ్రిటన్ మొత్తం జనాభా 7 కోట్లు. అయితే చాలా దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు 3 లక్షల మందికిపైనే ఉంటారు. వీధుల్లో నిద్రిస్తున్నవారు,  కార్లలో నివసిస్తున్న వారు,  హాస్టళ్లలో ఉంటున్న వారు,  కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో తలదాచుకుంటున్న వారు ఇంకో 3 లక్షల మంది ఉంటారు.  ఇలాంటి వారికి ఇళ్ళను కట్టించి ఇవ్వడమే హోమ్ వార్డ్స్ మెగా ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రోగ్రాం లో భాగంగా నిర్మించిన 2 కాలనీలను ప్రిన్స్ విలియం ప్రారంభించారు.

Also read : Air India Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఉదంతం.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఘటన..!

హోమ్ వార్డ్స్ ప్రాజెక్టులో భాగంగా  వచ్చే ఐదేళ్ళలో దేశంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించి ఇస్తామని(End To Homelessness) ఆయన ప్రకటించారు. ప్రస్తుత బ్రిటన్ రాజు చార్లెస్ 3 సింహాసనానికి తదుపరి వారసుడు ప్రిన్స్ విలియం. తద్వారా ఆయన ప్రజాభిమానాన్ని, ఆమోదాన్ని పొందే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రిన్స్ విలియం భార్య కేట్ నిర్వహించే  స్వచ్ఛంద సంస్థ రాయల్ ఫౌండేషన్ నుంచి హోమ్ వార్డ్స్ ప్రోగ్రాం కు కోట్లాది రూపాయల ఫండ్స్ ను గ్రాంట్ గా ఇస్తున్నారు.