Site icon HashtagU Telugu

PM Modi: నెద‌ర్లాండ్స్ ప్ర‌ధానితో మోడీ ఫోన్ ముచ్చట

Modi

Modi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నెద‌ర్లాండ్స్ ప్ర‌ధాన మంత్రి మార్క్ రూట్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాల‌పై దేశాధినేత‌లు చ‌ర్చించుకున్నారు.  జ‌లాల‌పై వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం, వ్య‌వ‌సాయంలో స‌హ‌కారం, అధునాత‌న సాంకేతిక‌త‌, అభివృద్ధి చెందుతున్న రంగాల‌పై ద్వైపాక్షిక స‌హ‌కారం వంటి అంశాల‌పై చ‌ర్చించారు.  అదేవిధంగా భార‌త్‌-యూర‌ప్ సంబంధాలపై కూడా నేత‌లు చ‌ర్చించారు. ఇండో ప‌సిఫిక్ వంటి ప్ర‌పంచ స్థాయి స‌మ‌స్య‌ల‌పైనా ఇరు నేత‌లు కొద్ది సేపు మాట్టాడుకున్నారు. ఇటీవ‌ల కాలంలో ఇరు దేశాల మ‌ధ్య సత్సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతున్న నేప‌థ్యంలో తాజాగా ఇరు ప్ర‌ధానుల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది. కాగా,  త‌న స్నేహితుడైన నెద‌ర్లాండ్స్ ప్ర‌ధానితో సంభాషించ‌డం ఎంతో సంతోషాన్నిచ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

భార‌త్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ దేశాల మ‌ధ్య ఆర్థిక అంశాల బ‌లోపేతం, స‌హ‌కార‌మే ల‌క్ష్యంగా గురువారం #I2U2 స‌ద‌స్సు జ‌రుగుతుంది. #I2U2 అంటే.. ఇండియా, ఇజ్రాయెల్‌, యూఎస్‌, యూఏఈ.  ఈ స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ గా ప్ర‌సంగించ‌నున్నారు. #I2U2 గ్రూపు దేశాల తొలి స‌ద‌స్సు ఇదే కావ‌డం విశేషం. ఈ స‌ద‌స్సులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి యాయిర్ ల్యాపిడ్‌, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్ లు పాల్గొన‌నున్నారు. ఈ సంయుక్త స‌మావేశంలో ప్ర‌ధానంగా నాలుగు దేశాల ఆర్థిక సంబంధాలు.. ప్రాజెక్టుల పురోగ‌తి వంటి వాటిపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం కార‌ణంగా త‌లెత్తిన ఆహార సంక్షోభం వంటి కీల‌క అంశాలు అజెండాలో ఉన్నాయి.