Prime Minister Candidate: మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని అభ్యర్థి.. మరో రెండు వారాల్లో ఎన్నికల వేళ..

ఎంతోమంది మహిళలు ప్రజాప్రతినిధులుగా మారుతున్నారు. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు రాజకీయ నాయుకురాళ్లుగా మారిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు సీఎంలుగా కూడా పనిచేశారు.

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 08:36 PM IST

Prime Minister Candidate: ఎంతోమంది మహిళలు ప్రజాప్రతినిధులుగా మారుతున్నారు. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు రాజకీయ నాయుకురాళ్లుగా మారిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు సీఎంలుగా కూడా పనిచేశారు. ఇప్పటికే పలువురు మహిళలు సీఎంలుగా పనిచేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా మహిళలు ప్రధానమంత్రులుగా అత్యున్నత పదవిలో రాణిస్తున్నారు.

త్వరలో ధాయ్ లాండ్ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్ధిగా పోటీలోకి దిగబోతున్న పెటోంగ్ షినవత్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె.. ఓ ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. తాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడతానని ఆమె చెప్పారు. బిడ్డకు ఫ్రితాసిన్ సుక్సావత్ అని పేరు పెట్టినట్లు చెప్పారు.

అయితే షినవత్రాకు ఇది రెండో సంతానం. ఆమె వయస్సు 36 కాగా.. గర్భిణీగా ఉండి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరడంతో గత కొంతకాలంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో వీడియో కాల్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ బాగా క్రేజ్ ఉంది. దీంతో ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అక్కడ సర్వేలలో ఆమె లీడ్ లో ఉన్నారు.

షినవత్రా ఎవరో కాదు.. మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా చిన్నకుమార్తెనే. అయితే ఆయన 2006లో సైనిక తిరుగుబాటు వల్ల ప్రధాని పదవిని కోల్పోయారు. ఇప్పుడు ఆయన కుమార్తె ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడవ మనవడు పుట్టినందుకు తనకు సంతోషంగా ఉందని తక్సిన్ ట్వీట్ చేశాడు. తాను విదేవాల్లో ఉండగా తన ఏడుగురు మనవళ్లు పుట్టారని అన్నారు. అయితే థాయ్ లాండ్ పార్లమెంట్ ఎన్నికలు మే 14న జరగనుండగా.. ఇప్పుడు ప్రచారం చివరిదశకు చేరుకుంది.