Site icon HashtagU Telugu

Kedarnath: కేదార్నాథ్ ఆలయానికి బంగారు మెరుగులు.. వ్యతిరేకిస్తున్న పురోహితులు!

Kedarnath

Kedarnath

దేశంలోనే ఎంతో ప్రత్యేకమైన హిందూ దేవాలయంగా కేదార్నాథ్ ఆలయం నిలుస్తుంది. హిమాలయాల్లో ఎంతో ప్రత్యేకంగా, ప్రకృతి రమణీయంగా ఉంటే కేదార్నాథ్ ఆలయానికి అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించే సందర్శకుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం.

కేదార్నాథ్ ఆలయానికి పూర్వ వైభవం తేవాలని ప్రధాని మోదీ కాగా.. అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేపట్టాయి. అయితే తాజాగా కేదార్నాథ్ ఆలయానికి బంగారు మెరుగులు దిద్దడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

కేదార్నాథ్ ఆలయం లోపలి గోడలకు ప్రస్తుతం వెండి ప్లేట్లు ఉండగా.. వాటిని తొలగించి బంగారు ప్లేట్లు ఉంచడంతో పాటు గోపురంలో కూడా బంగారం మెరుగులు దిద్దడానికి ఆలయ అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే 230కేజీల వెండి ప్లేట్లలో సగం ప్లేట్లను తొలిగించింది. కేదార్నాథ్ ఆలయానికి ఓ గుప్త దాత ఈ బంగారాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

కేదార్నాథ్ ఆలయానికి బంగారు దానం చేస్తున్న దాత పేరును ఆలయ అభివృద్ధి కమిటీ వెల్లడించలేదు కానీ అతడు ఓ వజ్రాల వ్యాపారి అని మాత్రం వెల్లడించింది. కాగా కేదార్నాథ్ ఆలయానికి బంగారు మెరుగులు దిద్దడానికి వీలులేదని పురోహితులు వ్యతిరేకిస్తున్నారు. హిమాలయాల్లో 8వ శతాబ్దంలో ఎంతో వైవిధ్య పరిస్థితుల్లో ఆలయాన్ని నిర్మించారని, ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం భౌతిక రూపం దెబ్బతినేలా బంగారు మెరుగులు వద్దని వారు వారిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తాము నిరసన దీక్షకు దిగుతామని కూడా పురోహితులు హెచ్చరించారు.