నేటి నుంచి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.135 తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర ఇప్పుడు రూ.2219 అవుతుంది. ధరలు తగ్గడానికి ముందు వాణిజ్య LPG సిలిండర్ ధర కోల్‌కతాలో రూ. 2454, ముంబైలో రూ. 2306, చెన్నైలో రూ. 2507గా ఉంది. తగ్గిన తరువాత కోల్‌కతాలో వాణిజ్య LPG సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2322, ముంబైలో రూ. 2171.50, చెన్నైలో రూ. 2373గా ఉంది.అంతకుముందు మే మొదటి వారంలో ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ. 50 పెంచారు. మే 1న, 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.102.50 పెరిగి రూ.2355.50కి చేరింది.
LPG Cylinder: నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సింలిండర్ ధర రూ. 135 తగ్గింపు

14 Kg Lpg Gas Cylinder Price Today