Site icon HashtagU Telugu

President Kovind: కరోనాపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకం

Covid

Covid

ఇవాళ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగింసున్నారు. ప్రతి భారతీయుడికీ స్వాతంత్ర్య అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. దేశంలో వచ్చే పాతికేళ్లు పునాదులు పటిష్ఠంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఏడాదిలోపే 150కోట్ల డోసుల పంపిణీని అధిగమించడం ఒక అద్భుతమైన రికార్డు అని రాష్ట్రపతి వెల్లడించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నానని, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ మూల సూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అన్నారు.