Queen Funeral: లండన్ చేరుకున్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!!

క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Droupadi Murmu telangana tour

Droupadi Murmu

క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు.లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరిగే క్వీన్ అంత్యక్రియలకు ముర్ము హాజరుకానున్నారు. సోమవారం జరగనున్న అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరపున రాణికి సంతాపం తెలియజేయనున్నారు.

తర్వాత రోజు, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో విదేశీ నేతలకు కింగ్ చార్లెస్ III ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో రాష్ట్రపతి పాల్గొంటారు. విదేశీ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో సహా లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. లండన్ విమానశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు బ్రిటన్ లోని భారత్ హైకమిషనర్ స్వాగతం పలికారు.

  Last Updated: 18 Sep 2022, 08:24 AM IST