Pregnant Women Vastu Tips: గర్భిణీలు ఈ చిట్కాలు పాటిస్తే బిడ్డ అందంగా పుడుతుందట!

ఆడవారికి తల్లి కావడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే గర్భవతి అయిన స్త్రీలు మొదటి నెల నుంచి బిడ్డ పుట్టే

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 07:15 AM IST

ఆడవారికి తల్లి కావడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే గర్భవతి అయిన స్త్రీలు మొదటి నెల నుంచి బిడ్డ పుట్టే వరకు కూడా ప్రతిక్షణం కూడా ఒక అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డ అందంగా ఆరోగ్యంగా జన్మించాలి అని ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు చేసే పనుల వల్ల మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వస్తువులు కూడా కడుపులో ఉన్న శిశువుల పై ప్రభావం చూపుతాయట. అయితే గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటిస్తే అందమైన బిడ్డ పుడతారట.

మరి బిడ్డ అందంగా జన్మించాలి అంటే ఎటువంటి వాస్తు చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు ఉన్న గదిలో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. గర్భిణీ స్త్రీ ఉన్న గదిలో శ్రీకృష్ణుడు,వేణువు, శంఖం ని ఉంచడం వల్ల అవి శిశువు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే భార్యాభర్తలు నవ్వుతూ ఉన్న ఫోటోని గర్భిణీ గదిలో ఉంచడం వల్ల పిల్లవాడు తల్లిదండ్రులకు చాలా దగ్గరగా ఉంటాడు. అదేవిధంగా గర్భిణీ స్త్రీకి కూడా ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. తద్వారా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు.

గర్భిణీ స్త్రీ ఉన్న గదిలో బాలగోపాలుడు ఫోటో లేదా విగ్రహం పెట్టాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఆ ఫోటోని లేదా విగ్రహాన్ని చూడటం వల్ల ఆ స్త్రీ మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇది పిల్లలపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీ ఉన్న గదిలో నవ్వుతూ ఉన్న పిల్లల చిత్రాలను ఉంచాలి. వీటి వల్ల గర్భిణీ స్త్రీ ఆందోళన తగ్గి ముఖంపై చిరునవ్వు పూస్తుంది. తల్లి సంతోషంగా ఉంటే కడుపులో ఉండే బిడ్డ కూడా సంతోషంగా ఉంటాడు. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్న గదిలో రాగి లోహంతో తయారు చేసిన వాటిని గదిలో ఉంచాలి. అవి గదికి సానుకూల శక్తిని తెస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీపై,బిడ్డపై చెడు కన్నులు పడవు.