హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది ఓ భవనం రెండో అంతస్తు నుంచి ఐదు నెలల గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన చందానగర్‌లోని వెంకటరెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. 23 ఏళ్ల శ్రీనికకు గతేడాది శ్రవణ్‌కుమార్‌తో వివాహమైనా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనిక మంగళవారం రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రి వైద్యులు ఆమెకు వాకింగ్ చేయాలని సలహా ఇచ్చారు. డాక్టర్ సలహా మేరకు శ్రీనిక భవనం రెండో అంతస్తులోని బాల్కనీలో నడుచుకుంటూ వెళ్తుండగా జారిపడింది. ఆమె బ్యాలెన్స్ తప్పి ఎత్తు నుంచి కిందపడింది. ఘటనాస్థలిని గమనించిన సమీపంలోని సెక్యూరిటీ గార్డు ఆమెను రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదిలావుండగా.. చందానగర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తుండగా, ఆమె మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.
Hyderabad : చందానగర్‌లో విషాదం.. బిల్డింగ్‌పై నుంచి పడి గర్భిణి మృతి

Deaths