Site icon HashtagU Telugu

IPL 2022: బెంగళూరు ఓపెనర్లు వీళ్లేనా ?

Rcb Ipl

Rcb Ipl

ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహణకి బీసీసీఐ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 26 నుంచి 10 జట్లతో ఈ మెగా టోర్నీ ప్రారంభంకాబోతుండగా.. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. ఈ సీజన్ లో పాల్గొనబోయే 10 జట్లని బీసీసీఐ రెండు గ్రూప్‌లుగా విభజించగా మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలువని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి ట్రోఫీ గెలవడమే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది…ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మెగా వేలంలో ఆర్‌సీబీ దాదాపు ప్రధాన ఆటగాళ్లపై మొగ్గు చూపి వేలంలో దక్కించుకుంది.

హర్షల్‌పటేల్‌,వనిందు హసరంగా, దినేశ్‌ కార్తిక్‌, హాజిల్‌వుడ్‌, డుప్లెసిస్‌ను మంచి ధర దక్కింది. అంతకుముందు రిటైన్‌ చేసుకున్న ప్లేయర్ల జాబితాలో​ విరాట్‌ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌తో పాటు సిరాజ్‌ ఉన్నారు.. అయితే ఐపీఎల్‌-2022 మెగా వేలంలో డుప్లిసెస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. దీంతో టాప్‌ఆర్డర్‌లో అతడికి కోహ్లీకి తోడుగా బరిలోకి దింపాలని ఆ జట్టు భావిస్తోంది. అందుకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ ఫొటోను కూడా ఆర్సీబీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది..దీంతో వీరిద్దరూ ఐపీఎల్ 2022 సీజన్ లో కోహ్లీ, డుప్లెసిస్ కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.

Exit mobile version