ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం అనూహ్యంగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఊపులో కార్యాచరణను రూపోందించేందుకు ఈ శుక్రవారం పీఆర్సీ సమతి సమావేశం కానుంది. ఈ క్రమంలో శనివారం నుండి సహాయ నిరాకరణ చేయనున్నారని, అలాగే సోమవారం నుండి సమ్మెలోకి వెళ్ళనున్నారని సమాచారం. ఇకముందు ఎట్టిపరిస్థితుల్లో మంత్రుల కమిటీతో చర్చలు జరిపే చాన్స్ లేదని తెలుస్తోంది.
అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాత్రమే తాము చర్చలు జరుపుతామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. సీయం జగన్ చర్చలకు ఆహ్వానిస్తే సమ్మెకు వెళ్ళే ముందు చర్చలకు వెళ్ళేందు సిద్ధమని, అయితే తాము పెట్టిన మూడు డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ఆర్టీసీ, విద్యుత్, ప్రజారోగ్యం వంటి శాఖలను కలుపుకుని ఈ నెల 7నుంచి సమ్మెకు వెళ్ళే చాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో ఈరోజు జరిగే సమావేశంలో భాగంగా పీఆర్సీ సాధన సమితి సభ్యులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.