Chalovijayawada: త‌గ్గేదేలే అంటున్న ఉద్యోగులు..!

  • Written By:
  • Updated On - February 3, 2022 / 03:13 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పీఆర్సీ సాధన సమితి నేతల ఛలో విజయవాడ సభ, ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా న‌లుమూల‌నుండి ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దెత్తున‌ భారీగా తరలి వచ్చారు.

ఈ క్ర‌మంలో పీఆర్సీ సాధన స‌మ‌తి నేత‌లు అధికా ప్ర‌భుత్వం పై తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధ‌న స‌మితి ప్రతినిధి సూర్యనారాయణ మాట్లాడుతూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్ట కథలు చెబుతున్నారని మండిప‌డ్డారు.

ఇక వారం రోజుల్లో తేల్చేస్తాన‌ని చెప్పిన‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట త‌ప్పార‌ని, ఉద్యోగ‌ సంఘాలతో ప్రభుత్వం నాలుగు స్తంభాలాట ఆడిందని సూర్య‌నారాయ‌ణ‌ అన్నారు. దీంతో చ‌లో విజయవాడను సక్సెస్ చేసి ఉద్యోగులు తమ సత్తా చాటారని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

ఆ త‌ర్వాత పీఆర్సీ సాధ‌న మ‌రో ప్ర‌తినిధి వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, ఉద్యోగుల ర్యాలీతో విజయవాడ దద్దరిల్లిందన్నారు. ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినకుండా కొత్త జీతాలు వేసిందని, దీంతో త‌మ ఆవేద‌న‌ను తెలియ‌జేసేందుకే చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి వ‌చ్చామ‌ని, ఉద్యోగులుగా మ‌నం త‌గ్గేదేలే అని, స‌గ‌టు ఉద్యోగికి న్యాయం జ‌రిగేందుకే ఈ ఉద్యమం అని వెంకట్రామిరెడ్డి అన్నారు. మ‌రి పీఆర్సీ సాధ‌న ప్ర‌తినిధుల వ్యాఖ్య‌ల పై జ‌గ‌న్ స‌ర్కార్ రియాక్ష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి.