Site icon HashtagU Telugu

TDP : ప్ర‌త్తిపాడు టీడీపీ ఇంఛార్జ్‌గా వ‌రుపుల రాజా స‌తీమ‌ణి స‌త్య‌ప్ర‌భ నియామ‌కం

varupula raja

varupula raja

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవ‌ర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా వ‌రుపుల సత్యప్రభను టీడీపీ అధినేత ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల ఇంఛార్జ్‌గా ఉన్న ఆమె భర్త వ‌రుపుల రాజా గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో పార్టీ నేతల నుంచి అభిప్రాయం సేకరించిన అనంతరం సత్యప్రభను ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. వ‌రుపుల రాజా డీసీసీబీ ఛైర్మ‌న్‌గా పని చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి స్వ‌ల్ప ఓట్ల‌తో ఓడిపోయారు. అధికారం పోయిన‌ప్ప‌టికీ నుంచి పార్టీలో చురుకుగా ప‌ని చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్న వ‌రుపుల రాజా మ‌ర‌ణం పార్టీకి తీర‌నిలోట‌ని నాయ‌కులు అన్నారు.

Exit mobile version