కాంగ్రెస్ పార్టీ హిమాచల్ చీఫ్‌గా మాజీ సీఎం సతీమణి ప్రతిభా వీరభద్ర సింగ్‌ను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు .. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ప్రతిభా వీరభద్ర సింగ్‌ను కాంగ్రెస్ మంగళవారం నియమించింది. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభ మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా సీనియర్ నేత ముఖేష్ అగ్నిహోత్రిని కొనసాగించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ… మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకి చైర్మన్‌గా నియమించగా, ఆశా కుమారి కన్వీనర్‌గా.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ చీఫ్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ ప్రాధాన్యత సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 43 స్థానాల్లో విజయం సాధించింది.