రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్…ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలను కంగారు పెడుతోంది. ప్రశాంతో కిషోర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. రాజకీయ సలహాదారుని కాకుండా పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారు.
పీకే పరిణామాలు…రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ అధినేతలు, కేసీఆర్, జగన్ లకు తీవ్రంగా కలవరపాటుకు గరయ్యేలా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దివంగత అహ్మద్ పటేల్ తరహాలో రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ కు పార్టీలో కీలక పదవిని ఆఫర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 2024 ఎన్నికల కోసం పీకే ఇప్పటికే ఓ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సోనియా గాంధీ అతని సూచనలు, సలహాలు, ఆలోచనలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరితే..?
పీకే అధికారికంగా కాంగ్రెస్ లో చేరి…ముఖ్యమైన శాఖను తీసుకుంటే…తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఏం చేస్తారన్నది ఓ పెద్ద ప్రశ్న. టీఆరెస్ జాతీయ రాజకీయాల్లో ఎదగాలన్న ఉద్దేశ్యంతోనే పీకే సహాయం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు కేసీఆర్ చెప్పారు. పీకే ఊరికనే పనిచేస్తున్నారని కూడా అన్నారు. అదే సమయంలో ఏపీలో జగన్ కూడా తన పాలనకు సంబంధంచి ప్రజల నుంచి సర్వేలు అందించేందుకు పీకే సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయాన్ని కూడా సేకరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో పీకే కాంగ్రెస్ లోకి చేరిత్ కేసీఆర్, జగన్ కు సాయం చేయడం కష్టమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది.
కాంగ్రెస్ 370సీట్లు సాధించాలన్న వ్యూహంతోనే…
కాంగ్రెస్ ను కాదని…టీఆరెస్ కు సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు పీకే. లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 370 సీట్లకు పైగా సాధించాలన్న వ్యూహం మీదే పీకే పనిచేయనున్నారు. కాబట్టి తెలంగాణలో లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడంలో టీఆరెస్ ఎలా వ్యవహారిస్తుందన్నది కీలకమైన ప్రశ్న. ఏపీలో కాంగ్రెస్ కు పెద్దగా సీట్లు లేవు. పీకే కాంగ్రెస్ చేరితే…జగన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లాలని పీకే డిసైడ్ అయ్యారు కాబట్టి…కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేయారు. ఇలాంటి సమయంలో జగన్ తో పీకే పనిచేయరన్నది పరిశీలకుల అభిప్రాయం. మొత్తానికి రానున్న రోజుల్లో పీకే ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.