Site icon HashtagU Telugu

NDTV : ఎన్డీటీవీ బోర్డుకు ప్రణయ్, రాధిక రాయ్ రాజీనామా

Ndtv Imresizer

Ndtv Imresizer

ప్రణయ్ రాయ్, ఆయ‌న భార్య రాధిక రాయ్ ఎన్డీటీవీ బోర్డుకు రాజీనామా చేశారు. వీరిద్ద‌రు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. NDTVలో RRPR కు ఉన్న 29.18 శాతం వాటాను అదానీ గ్రూప్స్ కొనుగోలు చేయడంతో వారు పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా మరియు సెంథిల్ సిన్నయ్య చెంగల్వరాయన్ – కంపెనీ బోర్డులో డైరెక్టర్లుగా చేరారు. NDTVలో ప్రస్తుతం అదానీ వాటా 55.18 %కి చేరుకోవడంతో హక్కులు ఆయన సొంతమయ్యాయి. అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్‌, ఎయిర్‌పోర్ట్స్‌, డిజిటల్ కేంద్రాలు, సిమెంట్లు, గ్రీన్ ఎనర్జీతో పాటు ఇప్పుడు మీడియా వైపు కూడా విస్త‌రించింది