Site icon HashtagU Telugu

Prakash Raj Tweet: మోడీ టూర్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు

Narendra Modi Prakash Raj

Narendra Modi Prakash Raj

నటుడు ప్రకాశ్ రాశ్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై తనదైన శైలిలో విమర్శించారు. ఎక్కడా కూడా మోడీ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘జేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటనల సమయంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారని, కానీ, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలి’’ పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.