Site icon HashtagU Telugu

Prakash Raj: కేసీఆర్‌ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్

Prakash Raj

Prakash Raj: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌, కేటీఆర్‌తో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని అన్నారు.  ఆయనతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు.  ఇదే సందర్భంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత,

ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం అవసరం ఉండటంతో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు పలువురు కేసీఆర్ ను చూసేందుకు ఆస్పత్రికి వస్తున్నారు.

Also Read: Kejriwal: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా మెరుగు: కేజ్రీవాల్