Site icon HashtagU Telugu

Prakash Raj: రాజ్యసభకు ప్రకాశ్ రాజ్?

Kcr Prakashraj

Kcr Prakashraj

తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. ఎగువ సభలో ఒక స్థానానికి ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మంగళ, బుధవారాల్లో కలిశారని, ఆయన ఎగువ సభకు నామినేట్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకాష్ రాజ్ కేసీఆర్ ను  కూడా కలిశారు. కేసీఆర్ కూడా ప్రకాశ్ రాజ్ ను రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మోడీతో వైరం పెట్టుకున్న కేసీఆర్… రాజ్యసభకు ప్రకాశ్ రాజ్ ను పంపిస్తే తన వాదనను గట్టిగా వినిపించవచ్చని తెలుస్తోంది. కాగా తెలంగాణ నుంచి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పేరు కూడా వినిపిస్తోంది.

అయితే అసెంబ్లీలో ప్రస్తుత బలం ప్రకారం మూడు స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుంది. తెలంగాణ నుంచి ఏడు రాజ్యసభ స్థానాలు ఉండగా, అన్నీ టీఆర్ఎస్ ఆధీనంలో ఉన్నాయి. ఈసీ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మే 19 చివరి తేదీ. మే 30న పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రానికి చెందిన రెండు రెగ్యులర్‌ ఖాళీల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.