Site icon HashtagU Telugu

Prakasam District : ప్రియుడి మ‌ర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. !

Knife Imresizer

Knife Imresizer

ప్రకాశం జిల్లా కొండపి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండ‌లంలోని మూగచింతల గ్రామం లో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ త‌న ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన ఘటన బ‌య‌ట‌ప‌డింది. 60 ఏళ్ల వ‌యసు ఉన్న బాధితుడు అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల ఓ మహిళ తో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికి ఇటీవల ఆర్థిక, ఇతర మనస్పర్థలు తలెత్తాయి. ఈనేపథ్యంలో మహిళ ఇంటికి వచ్చిన ప్రియుడిని బ్లేడుతో మర్మాంగాన్ని కోసింది. వెంటనే పొరుగువారు బాధితుడిని ఒంగోలు రిమ్స్‌లో చేర్చారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కొండపి ఎస్సై కె. రామకృష్ణ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.