Site icon HashtagU Telugu

Pragyan – 100 Meters Journey : చంద్రుడిపై ప్రజ్ఞాన్ జర్నీ.. కొత్త అప్ డేట్ వచ్చేసింది

Pragyan 100 Meters Journey

Pragyan 100 Meters Journey

Pragyan – 100 Meters Journey : చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై సాగిస్తున్న జర్నీకి సంబంధించి ఇస్రో కొత్త అప్ డేట్ ఇచ్చింది. ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్ల మేర ప్రయాణించిందని వెల్లడించింది. “ప్రజ్ఞాన్ 100” అంటూ ఇస్రో  శనివారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేసింది. రోవర్‌ని మరో రెండు రోజుల్లో స్లీప్‌ మోడ్‌లో పెడతామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు.

Also read : Aditya L1: మొదటి మూడు దశలు విజయవంతంగా పూర్తి

ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై అటూ ఇటూ కదులుతున్న మరో వీడియోను ఆగస్టు 31న ఇస్రో ట్విటర్‌లో పోస్ట్ చేసింది. రోవర్ 360 డిగ్రీల కోణంలో తిరుగుతుండటాన్ని అందులో చూపించారు. తాను వెళ్లే దారి ఎలా ఉంది ? అనేది క్లియర్ గా చూసుకుంటూ అది చంద్రుడిపై చక్కర్లు కొడుతోందని ఇస్రో పేర్కొంది. రోవర్ బుడిబుడి నడకలను చందమామపై చిన్న పిల్లాడి ఆటగా అభివర్ణిస్తూ ఆగస్టు 31న ఇస్రో (Pragyan – 100 Meters Journey) కామెంట్ పెట్టింది.