Prabhas: నో ఓటీటీ, ఓన్లీ థియేటర్స్.. డిజిటల్ స్ట్రీమింగ్ పై ప్రభాస్ కామెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ లు పెరిగిపోతున్నాయి.

  • Written By:
  • Updated On - June 30, 2022 / 04:58 PM IST

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ లు పెరిగిపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. OTT అరంగేట్రం గురించి తనకు భయాలు ఉన్నాయని ప్రభాస్ వెల్లడించాడు. ‘‘కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు  మూతపడటంతో ఓటీటీ వాడకం బాగా పెరిగింది. షూటింగ్ జరుపుకున్న ఎన్నో సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తడంతో  OTT బాట పడుతున్నాయి.

ఇప్పటికీ మెయిన్ సినిమాలు సైతం థియేటర్లలో విడుదలైన కొన్నిరోజులకే ఓటీటీలోకి వెళ్తున్నాయి. చాలా మంది నటులు OTTలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండాలనుకుంటున్నా’’ అని అన్నాడు. బహుశా కొన్ని చిత్రాలను OTTలో విడుదల చేయడం మంచిది, ప్రేక్షకులు థియేటర్‌లో కంటే ఇంట్లో చూడటానికి ఇష్టపడతారని చిత్రనిర్మాతలు భావిస్తే అది మంచి నిర్ణయమని భావిస్తున్నాను. ప్రస్తుతం, నా చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఓటీటీ మూవీస్ గురించి ఇప్పట్లో ఆలోచనేమీ లేదు. థియేటర్స్ లో సినిమాలు చూసేందుకు ఆసక్తిగా చూపుతానని ప్రభాస్ అన్నాడు.