Site icon HashtagU Telugu

Prabhas: సినిమా టికెట్ల ధరల జీవోపై స్పందించిన ప్రభాస్

Prabhas and Shraddha

ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్‌ ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ స్పందించారు. జగన్ సర్కార్ సినిమా టికెట్ల ధరలపై జీవో ఇస్తే సంతోషిస్తానని తెలిపారు. అయితే, ‘రాధేశ్యామ్‌’ చిత్ర విడుదలకు ముందే ఈ జీవో వస్తే ఇంకా చాలా సంతోషకరమని డార్లింగ్ ప్రభాస్ పేర్కొన్నారు .

కాగా, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, మూవీ టికెట్ ధరల అంశంపై సీఎం జగన్‌తో ఇటీవల సినీ ప్రముఖలు చర్చించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు.. త్వరలోనే ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని సినీ ప్రముఖలు తెలిపారు.