Site icon HashtagU Telugu

Prabhas: నీల్ బర్త్ డే.. ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్!

Pan India Star Prabhas

Prabhas

‘బాహుబలి’ సినిమాతో నేషనల్ హీరో అయిపోయిన ప్రభాస్ ‘సాలార్’ సినిమాలో కనిపించనున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టా వేదికగా తన ప్రేమను కురిపించాడు. ప్రశాంత్‌నీల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు! ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి.నువ్వు ఒక రత్నం. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నా. త్వరలో కలుద్దాం! అంటూ రాసుకొచ్చారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలయికలో వస్తున్న ‘సాలార్’ షూటింగ్ జరుపుకుంటోంది. పాన్ చిత్రాల్లో ఇది ఒకటి. కేజీఎఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ కు క్రేజ్ వచ్చింది. దేశవ్యాప్తంగా నీల్ పేరు వినిపిస్తోంది. ప్రభాస్ పౌరాణిక చిత్రమైన ‘ఆదిపురుష్’లో కనిపించనున్నాడు. ఇది దేశంలోనే  అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. డైరెక్టర్ మారుతి, సందీప్ వంగాతోనూ సినిమాలు చేయనున్నాడు ప్రభాస్.