Unstoppable 2 : బాలయ్య అన్​ స్టాపబుల్​ షోలో ప్రభాస్, గోపీచంద్​..

బాలకృష్ణ (Balakrishna) తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) షో సూపర్ హిట్ అయింది. తొలి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. రెండో సీజన్ లో బాలయ్య వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. రెండో సీజన్ తొలి ఎడిసోడ్ లోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను ఇలాంటి టాక్ షోలకు పిలిచే కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇప్పుడు బాహుబలి […]

Published By: HashtagU Telugu Desk
Unstoppable Balakrishna

Unstopbale

బాలకృష్ణ (Balakrishna) తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) షో సూపర్ హిట్ అయింది. తొలి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. రెండో సీజన్ లో బాలయ్య వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. రెండో సీజన్ తొలి ఎడిసోడ్ లోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను ఇలాంటి టాక్ షోలకు పిలిచే కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ను అన్ స్టాపబుల్ (Unstoppable) షోకి తీసుకొచ్చారు.

ఈ షోకు తన స్నేహితుడు, తోటి హీరో గోపీచంద్ తో (Gopi Chand) కలిసి వచ్చారు ప్రభాస్ (Prabhas). బాలయ్యతో ప్రభాస్ తొలిసారి తెరపై కనిపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ప్రకటించింది. బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ చిత్రీకరణలో పాల్గొన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రభాస్, బాలయ్య ఒకే స్టేజ్, ఫ్రేమ్ లోకి వచ్చిన విషయాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నామని ట్వీట్ చేసింది. ‘మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుంది’ అని పేర్కొంది.

Also Read:  Paytm Investors : పేటీఎం ఇన్వెస్టర్ల కు మరో ఎదురుదెబ్బ..

  Last Updated: 12 Dec 2022, 02:29 PM IST