Site icon HashtagU Telugu

Prabhas Fined: రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కారుకి జ‌రిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

prabhas car

prabhas car

హైద‌రాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు కొర‌ఢా ఝులిపిస్తున్నారు. వీఐపీల‌ను, సెలబ్రిటీల‌ను సైతం పోలీసులు ఏ మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌, మంచు మనోజ్, నాగ చైతన్య‌, ద‌ర్శ‌కుడు తివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల‌కు నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు  ఫైన్ విధించారు. తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కారుకి పోలీసులు జ‌రిమానా విధించారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో ప్రభాస్ కారును ఆపిన పోలీసులు కారుకు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండడం, కారుకు ఎంపీ స్టిక్కర్ అతికించి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే బ్లాక్ ఫిల్మ్ ను, ఎంపీ స్టిక్కర్ తొలగించి రూ.1,450 జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో కారులో ప్రభాస్ లేరని, డ్రైవర్ చేత జరిమానా కట్టించినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలకు ఉన్న బ్లాక్‌ స్టిక్కర్లు, బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే చాలా మంది సెల‌బ్రిటీలు  త‌మ ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్‌లు వాడుతున్నారు.