Powerful Earthquake: అర్జెంటీనాలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

అర్జెంటీనాలోని కార్డోబాలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. అర్జెంటీనాకు ఉత్తరాన 517 కిలోమీటర్ల దూరంలో శనివారం తెల్లవారుజామున 3:39 గంటల ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ సమాచారాన్ని అందించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.

Published By: HashtagU Telugu Desk
Philippines

Earthquake 1 1120576 1655962963

అర్జెంటీనాలోని కార్డోబాలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. అర్జెంటీనాకు ఉత్తరాన 517 కిలోమీటర్ల దూరంలో శనివారం తెల్లవారుజామున 3:39 గంటల ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ సమాచారాన్ని అందించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం కోర్డోబాకు ఉత్తరాన 517 కి.మీ దూరంలో 586 కి.మీ లోతులో ఉంది. ప్రస్తుతం అర్జెంటీనాలో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం ప్రకంపనలు బలంగా ఉన్నప్పటికీ అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

Also Read: Gold Price Today: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..!

ఇక.. ఇండోనేషియాలో జనవరి నెలలో ఇప్పటివరకు మూడుసార్లు బలమైన భూకంపం సంభవించింది. జనవరి 18న ఇండోనేషియా భూమి ఒక్కరోజులో రెండుసార్లు కంపించింది. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో 6.1 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. ఆ తర్వాత తూర్పు ఇండోనేషియాలోనే 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతకుముందు ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో 6.0 తీవ్రతతో భూకంపం వచ్చింది.

2022 నవంబర్ 21న పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో సంభవించిన 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 331 మంది మరణించారు. దాదాపు 600 మంది గాయపడ్డారు. అంతకుముందు సులవేసిలో 2018 భూకంపం, సునామీలో సుమారు 4,340 మంది మరణించారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ కారణంగా డజను దేశాల్లో 2,30,000 మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌కు చెందినవారు ఉన్నారు.

  Last Updated: 21 Jan 2023, 07:45 AM IST