Site icon HashtagU Telugu

Powerful Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. జనం బెంబేలు

Earthquake

Peru Earthquake

ఇండోనేషియాలోని పశ్చిమ ప్రావిన్స్ యోగ్యకార్తాలో 6.0 తీవ్రతతో భారీ భూకంపం(Powerful Earthquake) సంభవించింది. దీంతో డజన్ల కొద్దీ ఇళ్ళు దెబ్బతిన్నాయి. భూకంప ప్రకంపనలు యోగ్యకార్తా ప్రావిన్స్ సమీపంలోని సెంట్రల్ జావా, తూర్పు జావా ప్రావిన్సులలో కూడా కనిపించాయి. ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత.. మరో ఐదుసార్లు భూమి కుదుపులకు గురైనట్లు ఫీలింగ్ కలిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూప్రకంపనల(Powerful Earthquake) తర్వాత ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి ఉంటే.. అలాంటి ఇళ్ల లోపల ఉండొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also read : 48 Died : దెయ్యం ట్రక్కు బీభత్సం.. 48 మంది మృతి

యోగ్యకార్తా ప్రావిన్స్‌లోని బంతుల్ రీజెన్సీలో ఉన్న బాంబంగ్లిపురోకు నైరుతి దిశలో 84 కిలోమీటర్ల (52 మైళ్లు) దూరంలో  86 కిలోమీటర్ల (53 మైళ్ళు) లోతులో భూకంపం కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. “బంతుల్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. ఒక ఆసుపత్రి గోడలకు పగుళ్లు వచ్చాయి. సముద్ర తీరం వెంట ఉన్న కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి” అని యోగ్యకార్తా ప్రావిన్స్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. బంతుల్‌ జిల్లాలో 67 ఏళ్ల మహిళ భయంతో ఇంటి నుంచి బయటికి పరుగెడుతూ కింద పడిపోయి మరణించింది.  కనీసం ఇద్దరికి గాయాలయ్యాయి. యోగ్యకార్తా, సెంట్రల్ జావా, తూర్పు జావా ప్రావిన్సుల  పరిధిలో దాదాపు 93 ఇళ్లతో పాటు పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రార్థనాలయాలు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి.