Site icon HashtagU Telugu

Khammam: జూన్ 2న ఖమ్మంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Weightlifting

Weightlifting

Khammam: జూన్ 2వతేదీన ఖమ్మం లోని టీఎన్జీవో భవన్ ప్రాంగణంలో జరిగే పవర్ వెయిట్ లిఫ్టింగ్,బెంచ్ ప్రెస్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను పవర్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఖమ్మం బురహాన్ పురంలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్రను అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఖమ్మం జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్, సభ్యులు రాపర్తి రాజా, బోయిన కార్తీక్,బాలు నాయుడు,నగీనా తదితరులు ఆదివారం కలిసి శాలువాలతో సన్మానించారు.

ఖమ్మం సర్థార్ పటేల్ స్టేడియం ఎదురుగా ఉన్న “క్లాసిక్ జిమ్”పక్షాన కలిసిన వీరిలో బాలు నాయుడు “మిస్టర్ ఇండియా” తెలంగాణ పోటీలలో వెండి పతక విజేత, బోయిన కార్తీక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో “ది బెస్ట్ లిఫ్టర్”గా ప్రశంసలందుకున్నారు. నగీనా”స్ట్రాంగ్ ఉమెన్”టైటిల్ గెల్చుకున్నారు.రాపర్తి రాజా ఆధ్వర్యంలో జూన్ 2వతేదీన ఖమ్మం లోని టీఎన్జీవో భవన్ ప్రాంగణంలో జరిగే పవర్ వెయిట్ లిఫ్టింగ్,బెంచ్ ప్రెస్ పోటీలకు ఎంపీ వద్దిరాజును ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా వారు కోరగా,ఆయన సానుకూలంగా స్పందించారు.