ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali)కి కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బెయిల్ పిటిషన్‌పై గత ఐదు రోజులుగా వాదనలు కొనసాగగా, చివరకు రూ.20 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల జామీనుతో పోసానికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సంబంధిత నిబంధనలను అనుసరించి పోసాని తక్షణమే బెయిల్ పొందే అవకాశం ఉంది.
Rohit Sharma: రోహిత్ శర్మ ODI ప్రపంచ కప్ 2027 ఆడతాడా?
కేవలం కర్నూలులోనే కాకుండా విజయవాడ భవానీపురం కేసులోనూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నరసారావుపేట జిల్లా కోర్టు కూడా పోసాని కృష్ణమురళికి నిన్న (మార్చి 10) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఆయనపై నమోదైన పలు కేసుల్లో విచారణ జరుగుతుండగా, తాజాగా కర్నూలు కోర్టు నుండి కూడా తనకు అనుకూలంగా తీర్పు రావడంతో పోసాని రేపు జైలు నుండి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.