Posani : అంత సజ్జలే..నాకు ఏం తెలియదు – పోసాని

Posani : తన వ్యాఖ్యలు స్వయంప్రేరితంగా కాకుండా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే చేశానని పోసాని అంగీకరించినట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Posani Remand Report

Posani Remand Report

ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) రిమాండ్ రిపోర్టు(Remand Report)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన వ్యాఖ్యలు స్వయంప్రేరితంగా కాకుండా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే చేశానని పోసాని అంగీకరించినట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించడానికి, ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికి తనపై ఒత్తిడి తెచ్చారని, ఆ స్క్రిప్ట్ సజ్జల రాసిచ్చినదేనని పోసాని వెల్లడించినట్లు సమాచారం.

Urvashi Rautela: గొప్ప మనసు చాటుకున్న బాలయ్య బాబు హీరోయిన్.. పొగడ్తల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్!

సజ్జల కుమారుడు భార్గవ్ ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయించే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పోసాని అంగీకరించారు. తన ప్రసంగాలు ఎప్పుడు, ఎలా ఉండాలో కూడా ముందుగా నిశ్చయించి, హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించేందుకు అనుమతిని సజ్జల నుంచే తీసుకున్నట్లు తెలిపారు. పోసాని తెలిపి ఈ వ్యాఖ్యలు వైసీపీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విభేదాల కోసం వ్యక్తిగత దూషణలకు పాల్పడటాన్ని పలు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోసాని చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కథనం ఇప్పుడు బహిరంగంగా మారడంతో ఈ అంశం ఏపీ రాజకీయాలలో మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  Last Updated: 01 Mar 2025, 10:41 AM IST