Site icon HashtagU Telugu

Posani: పోసాని కృష్ణ మురళికి కరోనా.. ఇది మూడోసారి!

Posani

Posani

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖు నటుడుగా, రచయితగా, డైరెక్టర్గా పేరుపొందారు నటుడు పోసాని కృష్ణ మురళి (Posani). ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పోసాని. అలాంటి నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా సోకింది.

దీంతో హైదరాబాద్ (Hyderabad) ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ (Corona Positive) గా నిర్ధారణ అయింది. అయితే.. కృష్ణ మురళికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి. కాగా..తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.