Site icon HashtagU Telugu

Posani – Lokesh : తనను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర – పోసాని

Posani Krishna Murali Shocking Comments On Chandrababu

Posani Krishna Murali Shocking Comments On Chandrababu

తనను హత్య చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషే (Nara Lokesh) కారణమన్నారు ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ (Posani Krishna Murali ) మురళి. లోకేష్ తనపై పరువు నష్టం దావా వేయడం పై స్పందించారు. ఈ క్రమంలో లోకేష్ , చంద్రబాబు (Chandrababu) లపై పోసాని విరుచుకపడ్డారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష కట్టారని పోసాని ఆరోపించారు. కంతేరులో 14 ఎకరాలు కొన్నారని తాను అన్నానని లోకేష్ పరువు నష్టం దావా వేశారని పోసాని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా… అల్‌ ఖైదా పేరు చెబితే బిన్ లాడెన్ గుర్తుకు వచ్చినట్టు, హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకు రాడా? హెరిటేజ్ ఆస్తులు (Heritage Property) నీవి కావా? అంటూ పోసాని ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నమాట నిజం‌కాదా? అసలు లోకేష్‌ ఎవరిపై విమర్శలు చేయలేదా? అని పోసాని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్‌ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌ పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అని అన్నారు.

“నేను అమ్ముడు పోయే వ్యక్తిని కానని.. వైఎస్ జగన్ వ్యక్తిత్వం చేరే ఆయన చెంతకు చేరాను. నా జీవితాంతం వైఎస్ జగన్ వెంట ఉంటాను. చావుకు భయపడని వ్యక్తిని. నన్ను చంపాలని నారా లోకేష్ కుట్ర చేస్తున్నారు. మంగళగిరి కోర్టుల చుట్టూ నన్ను తిప్పాలని.. నేను వెళ్లినప్పుడు చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ నేను చనిపోతే దానికి లోకేష్ దే బాధ్యత. అయినా చావుకు నేను భయపడను’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని.

Read Also : AP : హిందూ సంప్రదాయంపై అవగాహనలేని వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా చేస్తారు..? – బండి సంజయ్