USA: కోట్ల ఫాలోవర్స్ ఉన్నా కూడా.. అడవిలో జీవిస్తున్న పాపులర్ టిక్ టాకర్..?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి అందులో రకరకాల వీడియోలు తీస్తూ వైరల్

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 03:59 PM IST

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి అందులో రకరకాల వీడియోలు తీస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఒక వ్యక్తి ప్రస్తుతం అడవుల్లో నివసిస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్‌. టిక్‌టాక్‌ లో ఇతనికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అయినా కూడా ఎంతో సింపుల్ గా ఉంటూ మనుషులకు దూరంగా అడవిలో బతికేస్తూ ఉన్నాడు. మామూలుగా జనసంచారంలో ఉన్న ప్రదేశంలో గుహల్లోకి వెళ్లాలి అంటే తెగ భయపడిపోతూ ఉంటాం. అటవీ ప్రాంతాల్లో ఉండే గుహల సంగతి చెప్పనక్కర్లేదు.

 

అలాంటి గుహలలో తలదాచుకోవడం అన్నది అంతా సులువైన పనేమీ కాదని చెప్పవచ్చు. పొరపాటున ఆ గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, ఆ గుహ ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లు లాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి.

 

గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్‌ అవుతున్నారు.