Jaya Sudha-BJP : బీజేపీలోకి జయసుధ.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్టు కథనాలు

Jaya Sudha-BJP : తెలంగాణ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టిన  కిషన్ రెడ్డి పార్టీలోకి చేరికలను పెంచడంపై ఫోకస్ పెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Jaya Sudha Bjp

Jaya Sudha Bjp

Jaya Sudha-BJP : తెలంగాణ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టిన  కిషన్ రెడ్డి పార్టీలోకి చేరికలను పెంచడంపై ఫోకస్ పెట్టారు. బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి ఉన్న నాయకులతో ఆయన భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. దీంతో జయసుధ బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. ఇదే విషయంపై కిషన్ రెడ్డితో ఆమె చర్చించారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధ తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్ పై 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా(Jaya Sudha-BJP) గెలిచారు.

Also read : Electric Vehicle Charger: మీరు ఎలక్ట్రిక్ కారు లేదా స్కూటర్‌ ఉపయోగిస్తున్నారా..? అయితే మీరు ఇంట్లోనే EV ఛార్జర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఇలా..!

గతంలోనూ ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సినీ నిర్మాతతో కలిసి వెళ్లి జయసుధ బీజేపీ చేరికల కమిటీతో భేటీ అయినట్టు సమాచారం. అయితే అప్పట్లో చర్చల తర్వాత.. బీజేపీ కానీ,  జయసుధ కానీ ఎలాంటి వివరాలను మీడియాకు వెల్లడించలేదు. ఆ చర్చల సందర్భంగా పార్టీలో చేరే విషయంపై జయసుధ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బీజేపీ నాయకులు అప్పట్లో చెప్పారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలవడంతో జయసుధ త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also read : Minor Raped : చిన్నారిపై గ్యాంగ్ రేప్.. పాప ఒళ్లంతా పంటిగాట్లు

  Last Updated: 29 Jul 2023, 01:09 PM IST