Site icon HashtagU Telugu

Dubbing Artist Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. . ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి

Dubbing Artist Passes Away

Srinivas

సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. అలనాటి నటి జమున మరణించిందని వార్త విన్న కొన్ని గంటలు కూడా గడవకముందే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి (Dubbing Artist Srinivasa Murthy) చెన్నైలో కన్నుమూశారు. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎ.శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస మూర్తి తమిళ హీరో సూర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పి పాపులర్ అయ్యారు. రాజశేఖర్, అజిత్ కుమార్, విక్రమ్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, ఉపేంద్ర, ప్రభుదేవా లాంటి హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పారు.

Also Read: Jamuna: బ్రేకింగ్.. సీనియర్ నటి జమున కన్నుమూత

‘అపరిచితుడు’లో విక్రమ్ కి, ‘సింగం’ సిరీస్‌లో ’24’, ‘వీడొక్కడే’, ‘గజిని’లో సూర్యకి, ‘జనతా గ్యారేజ్‌’లో మోహన్‌లాల్‌, ‘అల వైకుంఠపురంలో’ జయరామ్‌తో పాటు మరెన్నో సినిమాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు. పాత్రకు తగిన వేరియేషన్స్ ఇవ్వడంలో నిష్ణాతుడైన ఆయన తన అద్భుతమైన పనితనం ద్వారా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. శ్రీనివాసమూర్తి మృతి పట్ల తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివామూర్తి అంత్యక్రియల గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ఇవాళ, లేదంటే రేపు చెన్నైలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉంది.