పాప్ సింగర్ మేతా ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ లో పాము కాటుకు గురైంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ‘జే Z’ లేబుల్ రోక్ నేషన్ ఆల్బమ్ కు సైన్ చేసింది. అయితే మ్యూజిక్ వీడియో షూట్ కోసం సెట్స్ కు వెళ్లింది. కార్పెట్‌పై పడుకుని, అనేక పాములు చుట్టుముట్టినట్లు వీడియో చిత్రీకరణకు ట్రయల్స్ వేస్తండగా, నల్ల పాము ఒకటి పైకి పాకి కాటు వేసింది. దీంతో ఆమెకు ఏం జరిగిందో తెలియక షాకైంది. ఆ తర్వాత తేరుకొని ‘‘పాము నన్ను కరిచింది’’ అంటూ దూరంగా నెట్టింది. ఆ తర్వాత నొప్పి నొప్పి అంటూ చెప్పడం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Video Shoot: పాప్ సింగర్ కు పాముకాటు.. వీడియో వైరల్!

Pop Singer