Site icon HashtagU Telugu

Pooja Hegde Injured: పూజ కాలికి ఫ్యాక్చర్.. అయినా షూటింగ్

Pooja

Pooja

టాలీవుడ్ బుట్టబొమ్మకు గాయమైంది. ప్రస్తుతం మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో నటిస్తున్న పూజ హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. షూటింగ్ లో భాగంగా ఒక నగరం నుంచి మరో నగరానికి చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో పూజ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఎంతలా అంటే తన కాలు దెబ్బ తగిలినా విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఆమెకు లేకుండా పోయింది. కాలుకు పట్టీ వేసుకొని ఆమెకు షూటింగ్ లో పాల్గొంటోంది.

తన కాలుకు దెబ్బ తగిలిందని పూజ నిన్న తెలిపింది. చీలమండలో చీలిక ఏర్పడిందని చెబుతూ బ్యాండేజీ వేసిన కాలు ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దాంతో, తను కొన్ని రోజులు షూటింగ్ కు దూరం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఒక రోజు కూడా తిరగకుండానే తను షూటింగ్ లొకేషన్ లో ప్రత్యక్షమైంది. కాలుకు బ్యాండేజీతోని మేకప్ రూమ్ లో ఉన్న ఫొటోను షేర్ చేసిన పూజా ‘షో నడవాల్సిందే’ అని క్యాప్షన్ ఇచ్చింది.

Exit mobile version