Site icon HashtagU Telugu

Pooja Hegde: పూజ జోరు.. సల్మాన్ తో సినిమా షురూ!

Pooja

Pooja

పూజా హెగ్డే టాలీవుడ్‌ను శాసించే రాణి. ఈ అందమైన నటి బాలీవుడ్‌లో రెండు సినిమాలకు కూడా సైన్ చేసింది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో నటించడానికి రెడీగా ఉంది. కోవిడ్-19 కారణంగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేల హిందీ చిత్రం ఆలస్యం అయింది. ఎట్టకేలకు వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. ముంబైకి సమీపంలోని కర్జాత్‌లో మేలో మారథాన్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి పూజా హెగ్డే తన డేట్‌లను ఇచ్చింది. 90 రోజుల షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నారు. పూజా హెగ్డే కూడా ఈ ప్రాజెక్ట్‌పై మరో రెండు మూడు నెలలు వర్క్ చేయాల్సి ఉంటుంది.

మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ల “భవదీయుడు భగత్ సింగ్” తెలుగు రెగ్యులర్ సినిమాల షూటింగ్ ప్రారంభం కాలేదు. కాబట్టి పూజ ఎలాంటి టెన్షన్ లేకుండా సల్మాన్ ఖాన్ సినిమాపై దృష్టి పెట్టొచ్చు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న ఆచార్య మూవీలో పూజ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Exit mobile version