Site icon HashtagU Telugu

Ponguleti Srinivasa Reddy : కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త తెలిపిన పొంగులేటి..

Cantonment

Cantonment

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కంటోన్మెంట్ (Cantonment ) ప్రజలకు శుభవార్త తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తరువాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతి ఏటా 6 వేల ఇండ్లు కేటాయించి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తి ఫోకస్ లోక్ సభ ఎన్నికలపైనే పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించగా..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా అలాంటి విజయమే సాధించాలని చూస్తుంది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. అలాగే కంటోన్మెంట్ లో జరగబోయే ఉప ఎన్నికలో కూడా విజయం సాధించాలని చూస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించలేకపోయింది. ఇప్పుడు అనుకోకుండా కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఈసారి కంటోన్మెంట్ స్థానం దక్కించుకోవాలని చూస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి శ్రీ గణేశ్ కు మద్దతుగా మంత్రి పొంగులేటి ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బిడ్డను విడిపించుకునేందుకు బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే తామిచ్చిన హామీలలో 5 అమలు చేశామని, మిగతావి కూడా, అదేవిధంగా ఇయ్యని హామీలను కూడా నెరవేరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీగణేశ్ గెలిస్తే మంత్రి అవుతారని, సునీతా గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమె కూడా కేంద్ర మంత్రి అవుతారని.. దీంతో కంటోన్మెంట్ ను మరింత అభివృద్ధి చేసుకోవొచ్చని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణకు కేంద్రం రూ. లక్షల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని.. కానీ, పన్నుల రూపంలో రూ. లక్షల కోట్లు తెలంగాణ నుంచి తీసుకున్న కేంద్రం కేవలం మూడో వంతు మాత్రమే తెలంగాణకు నిధులిచ్చిందంటూ కౌంటర్ ఇచ్చారు.

Read Also : TG : కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలది ‘ట్రయాంగిల్’ బంధం – అమిత్ షా

Exit mobile version