Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 04:40 PM IST

Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనేరు బావి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈటల రాజేందర్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మల్కాజ్గిరి లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందు వాహిని సేన ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర జగద్గిరి గుట్ట సాలసర్ హనుమాన్ ఆలయం నుండి ఐడీపీల్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు రామమందిరంలో హనుమంతుడికి యజ్ఞము ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు. మహిళలు హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబట్టి శుభయాత్రకు తరలి వచ్చారు. ఈ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ పాతబస్తీ హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిపుర డివిజన్ లోని నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వహిందూ పరిషత్. మరియు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో నలుమూలల నుండి వేలాది మంది భక్తులు యువకులు కాషాయం జెండాలు చేతిలో పట్టుకొని జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బ్యాండ్ మేళాలు డీజే పాటలతో నృత్యాలతో శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఈ శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలో నీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో అడుగడుగున సీసీ కెమెరాలతో శోభాయాత్ర కదలికలను పరిశీలిస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు.