Site icon HashtagU Telugu

AP Politics: సోలో గేమ్ సో బ్యాడ్

Pawan in BJP's strategy

Pawan in BJP's strategy

చంద్రబాబు అవసరం ఇపుడు ఉందని మోడీ సహా కేంద్ర పెద్దలు గుర్తించారు. ఎన్డీయే నుంచి బయటకు బలమైన జేడీయూ వెళ్ళిపోయిన నేపధ్యంలో చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నేత చాణక్యుడు వెంట ఉన్నారని చెప్పుకోవడమే ఇపుడు బీజేపీకి అవసరం. ఏపీలో రాజకీయంగా తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయడానికి బాబుకు కూడా బీజేపీ అండ కావాలి. పరస్పర అవగాహంతోనే ఢిల్లీలో మోడీ బాబు షేక్ హ్యాండ్ మీటింగ్ జరిగింది.2014లో పోటీ చేసినట్లుగా 2024లో కూడా బీజేపీ టీడీపీ జట్టు కట్టే ఛాన్స్ ఉంది. కానీ జనసేన కూడా ఈ కూటమిలో చేరుతుందా? చేరితే వచ్చే రాజకీయ లాభమేంటి?అనేది ఇపుడు చర్చగా ఉంది.
పవన్ కోరుకున్నది కూడా వైసీపీ వ్యతిరేక కూటమి కోసమే. అందుకే ఆయన జనసేన ఎనిమిదో ఆవిర్భావ సభలో పిలుపు ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనీయను అంటూ చెప్పుకొచ్చారు. అయితే కూటమికి పవన్ పెద్దన్నగా ఉంటూ అటూ టీడీపీ ఇటు బీజేపీని నడిపించాలని కోరిక. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ తగ్గాలని ఏపీలో బలమైన టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగ్గాలని పవన్ కోరారు. పవన్ పార్టీ నుంచి పవర్ షేరింగ్ డిమాండ్ ఇండైరెక్ట్ గా వచ్చిన మీదట తెలుగుదేశం ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే నేరుగానే బీజేపీతో పొత్తులకు ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది. కేంద్రంలోని బీజేపీ కూడా రాజకీయ పరిస్థితులు ప్రతికూలం అవుతున్న వేళ బాబుని దగ్గరకు చేర్చుకుంటోంది. కానీ ఈ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జనసేన కూడా వారితో జట్టు కడుతుందా? అన్నదే ఇపుడు చర్చంతా.

జనసేన ఆలోచన ఒక్కటే. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎవరు జట్టు కట్టినా పవన్ సీఎం కావాలని ఆ పార్టీ కోరుకుంటుంది. ఈసారి కాకపోతే మరోసారికి సీఎం పదవి అ వాయిదా వేసుకోవడానికి లేదని జనసేన పట్టుదలగా ఉంది. బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నాక పవర్ షేరింగ్ విషయంలో ఆ పార్టీలను ప్రశ్నించే విషయమే ఉండదని కూడా జనసేనకు తెలుసు.

నిజానికి జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ టీడీపీతో పొత్తు అంటే పవన్ కూడా సీఎం కావాలని ఆ దిశగా పవర్ షేరింగ్ ఉండాలని డిమాండ్ ఛాన్స్ ఉంది. ఇపుడున్న పరిస్థితులలో బీజేపీ అలా ఎందుకు చేస్తుంది. ఏపీలో బీజేపీ జనసేనల మధ్యన అంత సాన్నిహిత్యం ఉందా? అన్నది కూడా ప్రశ్నగా ఉంది.పవన్ టీడీపీ పొత్తు పెట్టుకోవాలంటే పవర్ షేరింగ్ ఉండాల్సిందే అని షరతు పెడితే ఒప్పుకుంటారా?ఇది కూడా కీలకమైన ప్రశ్నగానే చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో పవర్ షేరింగ్ నకు అవకాశం లేదని చెప్పేందుకే బీజేపీని టీడీపీ దారికి తెచ్చుకుంది. పొత్తు కట్టాల్సిన అనివార్యతను జనసేనకు టీడీపీ ఇపుడు కల్పిస్తోంది.
అనూహ్యంగా టీడీపీ బీజేపీ పొత్తు నడవడం అన్నది జనసేనకు ఇబ్బందిగానే ఉంది. ఈ రెండు పార్టీలతో కలిస్తే కొన్ని సీట్లు పొత్తులో భాగంగా వస్తాయి తప్ప సీఎం సీటు పవర్ షేరింగ్ అన్నది మాత్రం అసలు జరిగే వ్యవహారం కాదని తేలిపోతోంది. ఇలాంటి వేళ జనసేన ఏం చేస్తుంది. తన రాజకీయ వ్యూహం ఏంటి అన్నదే ఆసక్తిగా ఉంది. అక్టోబర్ 5 నుంచి పవన్ చేయబోయే బస్సు యాత్రతోనే చాలా విషయాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది.