Lokesh: పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి అని లోకేష్ ట్వీట్.. చంద్రబాబు వద్దకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..!

చంద్రబాబు వద్దకు వెళ్తున్న నారా లోకేష్ (Lokesh)ను పోలీసులు అడ్డుకున్నారు. దింతో నారా లోకేష్ పోలీసులపై ఫైర్ అయ్యారు. నా తండ్రి దగ్గరకి నేను వెళ్ళటానికి మీ పర్మిషన్ అవసరం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 07:46 AM IST

Lokesh: చంద్రబాబు వద్దకు వెళ్తున్న నారా లోకేష్ (Lokesh)ను పోలీసులు అడ్డుకున్నారు. దింతో నారా లోకేష్ పోలీసులపై ఫైర్ అయ్యారు. నా తండ్రి దగ్గరకి నేను వెళ్ళటానికి మీ పర్మిషన్ అవసరం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. దీనితో నారా లోకేష్ పాదయాత్ర వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను అడ్డుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా గంటసేపటి నుంచి పోలీసులు హై డ్రామా సృష్టిస్తున్నారు. నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్నారు పోలీసులు. రోడ్డు మీద నుంచి క్యాంపు సైట్ లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. నారా లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నీలదీశారు నారా లోకేష్.

పోలీసులతో నారా లోకేష్ ఏం మాట్లాడారంటే.. నాకు రక్షణ అవసరం లేదు. మొన్న చూశా మీరే దగ్గర ఉంది వ్యాన్ లో వేశారు. భీమవరంలో పోలీసులు ఏం చేసారో నేను చూశా. మీ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వాళ్ళ వలనే ముగ్గరికి కానిస్టేబుల్స్ కి దెబ్బలు తగిలాయి. వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మమల్ని, మా పార్టీ నాయకులని అరెస్ట్ చేశారు. మీకు చెప్పాల్సిన పని ఏం లేదు. నేను వెళ్తాను నాకు దారి ఇవ్వండి. నేను చంద్రబాబు గారి కొడుకుని నేను వెళ్తా. మీ పద్దతి కరెక్ట్ కాదు. నా ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గరికి నేను వెళ్తాను. నేను వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఎందుకు ఉంటుంది. అర్థరాత్రి వచ్చి అందరిని హౌస్ అరెస్ట్ చేశారు. మేము ఏం చేయకముందే మీరు లాఠీలను తీసుకొచ్చారు. లాఠీలు ఎందుకు తెచ్చారు అని పోలీసులను లోకేష్ అడిగారు.

Also Read: AP Bandh : రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చే ఆలోచనలో టీడీపీ..

పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్ అని ట్వీట్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని విజయవాడకు తీసుకెళ్తున్నారు. ఐతే తన అరెస్టుకు కారణం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైమా ఫేసీ లేకుండా అరెస్టు చెయ్యడానికి ఏం అధికారం ఉంది అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ దేశంలో తాను ఓ నెటిజన్ అన్న చంద్రబాబు తనను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, ఉరి తీయాలని చంద్రబాబు అన్నారు.

స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 37వ ముద్దాయిగా ఉన్నారని వివరించారు. చంద్రబాబు.. పోలీసుల తీరును తప్పుపట్టారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. శుక్రవారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా నంద్యాలకు తరలివచ్చారు. దీనితో నంద్యాలలో హైఅలర్ట్ నెలకొంది.