AR Rahman: ఏఆర్ రెహమాన్ కు షాకిచ్చిన పోలీసులు

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కు పోలీసులు షాకిచ్చారు. రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ ను మధ్యలోనే ఆపేశారు పూణే పోలీసులు

AR Rahman: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కు పోలీసులు షాకిచ్చారు. రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ ను మధ్యలోనే ఆపేశారు పూణే పోలీసులు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. పూణే పోలీసుల తీరును తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?

ఆదివారం రాత్రి పుణేలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ సంగీత కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రెహమాన్ తన టీమ్ తో హుషారైన పాటలతో మైమరిపించారు. రెహమాన్ అదిరిపోయే పాటలకు ఫ్యాన్స్ డ్యాన్సులతో హోరెత్తించారు. అంతా సరదాగా జరుగుతున్న సమయంలో పూణే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు వేదికపైకి వెళ్లి ప్రదర్శనను మధ్యలోనే ఆపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

పుణేలో రాత్రి 10 దాటిన తర్వాత బహిరంగ ప్రదర్శనలు నిషేధితం. కాగా 10 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. అయితే సమయం 10 దాటినా కంటిన్యూ చేశారు. ఓ పక్క రెహమాన్ పాడుతుండగానే పోలీసులు మధ్యలోనే షోని ఆపేశారు. దీంతో ఆ ఈవెంట్ కు వచ్చిన అభిమానులు షాక్ అయ్యారు. రెహమాన్ పడుతుండగా పోలీసులు ఆపడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.

అయితే మ్యూజిక్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా పూణే పోలీసులను ప్రశ్నించారు. దాంతో పూణే పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఈవెంట్ మధ్యలో ఆపడానికి వివరణ ఇచ్చుకున్నారు. పూణే జోన్ 2 డిసిపి స్మార్తన్ పాటిల్ మాట్లాడుతూ.. 10 గంటల తర్వాత ఎలాంటి ప్రోగ్రామ్స్ జరగకూడదని నిబంధనలు ఉండటం కారణంగా ఈవెంట్ నిర్వాహకులు 10 వరకే పర్మిషన్ ఇచ్చాము. మా పోలీసులు అప్పటికే ఇంకో పావుగంట వెయిట్ చేశారు. 10.15 అయినా కుడా ప్రోగ్రాం ఆపకపోవడంతో పోలీసులు స్టేజి మీదకు వెళ్లారు అని పూణే జోన్ 2 డిసిపి స్మార్తన్ పాటిల్ వివరణ ఇచ్చారు.

Read More: Arun Gandhi: మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత